24 Crafts Of The Movie

#24Crafts📽️🎥.....

Movie అంటే 24 Crafts కలయిక, ప్రతి Craft ఇంకో Craft కు Relate అయ్యి ఉంటుంది, So ఏ ఒక్కటి బాలేకున్న అది మిగతా వాటికి Effect అవుద్ది🧐🧐...

24 Crafts In Film Making

1. ART DiRECTOR💥💥
మనం సినిమాలో చూసే ప్రతి Set, ఆ Set లో ఉండే ప్రతి Property.. ఇలా ప్రతిదీ Art డైరెక్టరే Design చేస్తారు.. Art Direction బాగుంటే Cinema లో ప్రతి Frame అందంగా కనపడుతుంది.. అది గద్వాల్ కోటైనా, మాహిష్మతి సామ్రాజ్యమైనా, అది వీరి Creativity నుంచి వచ్చినవే...

2. AUDIO GRAPHERS💥💥
Dubbing, Re Recording, Sound Effects ఇవన్నీ వీరి దగ్గరికే వస్తాయి.. Scene Situation కు Sync అయ్యేలా  Sounds ను వాడేది వీరే.. ఒక Movie లో మనం వినే ప్రతి Sound కు కారణం వీరే.. వీరు చేసేదే Final Mixing...

3. STUDIO WORKERS💥💥
Art Director చెప్పేది Follow అయ్యి Set వేసేవారు Holders.. Set కు అవసరమయ్యే విధంగా Wood Cut చేసేవారు Carpenters.. ఒక Set Construction అయ్యాక దానికి Painting వేసేది Painters.. ఒక Set Construct అవాలంటే ఈ ముగ్గురు కష్టపడాలి..

4. CINEMA DRIVERS💥💥 
Shooting Spot కు అందరికన్నా First వచ్చేది చివరగా వెళ్ళేది వీరే.. ఆర్టిస్ట్స్ అందరినీ టైమ్ కు షూటింగ్ స్పాట్ కు తీసుకురావడం, సెట్ ప్రాపర్టీ నీ అవసరమైన ప్లేస్ కు షిఫ్ట్ చేయడం.. ప్యాకప్ చెప్పగానే ఆర్టిస్ట్స్ అందరినీ డ్రాప్ చేయడం వీరి పని...

5. PRODUCTION ASSISTANT💥💥
ప్రొడక్షన్ అసిస్టెంట్ అండ్ సెట్ అసిస్టంట్ ఇద్దరూ ఈ క్రాఫ్ట్ లోకే వస్తారు.. సెట్ లో ఉండే అందరి ఆకలి తీర్చేది ప్రొడక్షన్ అసిస్టెంటే, సెట్ వేయడానికి అవసరమయ్యే ప్రాపర్టీ తెచ్చేది, అయిపోయాక వేరే ప్లేస్ కు తీసుకునే వెళ్ళేవారు సెట్ అసిస్టంట్స్...

6. PRODUCTION EXECUTIVE💥💥
Post Production Works, Police Permission చూసేది, ఔట్డోర్ షూటింగ్ కు వెళ్ళేటప్పుడు లొకేషన్ పర్మిషన్స్ తెచ్చేది, మేకప్ నుండి ప్యాకప్ దాకా షూటింగ్ లో జరిగే ప్రతి విషయం చూసుకునే వాడు Production Executive...

7. JUNIOR ARTIST AGENTS💥💥
Production House కు జూనియర్ ఆర్టిస్ట్ ను సప్లయ్ చేసేవాళ్ళు వాళ్ళ కావాల్సిన ఫీచర్స్ తో ఉన్న వారిని అరేంజ్ చేసే వాళ్ళను జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్స్ అంటారు...

8. OUTDOOR UNIT TECHNICIANS💥💥
కెమెరామన్ చెప్పే ఇంస్ట్రక్షన్ ను ఫాల్లో అయ్యేవారిని కెమెరా అసిస్టెంట్స్ అంటారు, అలాగే ఆర్టిస్ట్ చెప్పే డైలాగ్ ను రికార్డ్ చేసే వారిని నగారా అంటారు, అలాగే షూటింగ్ స్పాట్ లో ఎలక్ట్రిసిటీ సప్లయ్ చేసే వారు ఎలక్ట్రీషియన్స్ అంటారు, వీరందరినీ కలుపుకొని Outdoor Unit Technicians అంటారు...

9. CINEMATOGRAPHER💥💥
ఒక డైరెక్టర్ విజన్ ను ఫస్ట్ తన కళ్ళతో చూసి మన కళ్ళకు అందంగా చూపించేది Cinematographer.. Surroundings ను యూజ్ చేసుకుని సినిమాకి తగ్గట్టుగా Cast ను అందంగా చుపించండమ్ వీరి పని, ఏ షాట్ కు ఏ లెన్స్ వాడాలి ఎంత లైటింగ్ ఉండాలి ఇలా ప్రతిదీ డైరెక్టర్ తో పాటు డిసైడ్ చేసేవారు Cinematographers... 

10. COSTUME DESIGNERS💥💥
వీరు క్యారక్టర్ కు తగ్గట్టుగా సినిమాలో నటీనటుల కాస్ట్యూమ్స్ ను డిజైన్ చేస్తారు, ఒక రాజు పాత్రకైనా రోబోకైనా వాళ్లకు సూటయ్యే కాస్ట్యూమ్స్ మీద వర్క్ చేసి అవి డిజైన్ చేయడం వీరి పని...

11. JUNIOR ARTISTS💥💥
మనం చూసే మూవీలో పెళ్లి సీన్ అయినా కోర్టు సీనైనా వెనక కనపడే జనం వీరే, వీరికి డైలాగ్స్ ఉండవు, ఏదో స్క్రీన్ మీద కనిపించామన్న ఆనందం తప్ప, ఏదో సాధించేద్దాం అని కసితో ఇండస్ట్రీ కి వెళ్ళే చాలా మంది ఇలా జూనియర్ ఆర్టిస్టులు గా మిగిలి పోతున్నారు...

12. PRODUCTION MAHILA💥💥
ఈ క్రాఫ్ట్ లో అందరూ లేడీస్సే ఉంటారు, ప్రొడక్షన్ అసిస్టెంట్ Instructions ను ఫాల్లో అవుతూ ఉంటారు, షూటింగ్ స్పాట్స్ ను క్లీన్ చేయడం, Utensils ను Wash చేయడం వీరి పని...

13. PUBLICITY DESIGNER💥💥
Movie ఎంత బాగా తీసిన పబ్లిసిటీ లేకపోతే మాత్రం చాలా కష్టం, పబ్లిసిటీ లో ఫస్ట్ స్టెప్ పోస్టర్ డిజైనింగ్, ఇప్పుడు మనం చూసే ఫస్ట్ లుక్ ను డిజైన్ చేసేది వీరే, పోస్టర్స్ తో మూవీ మెయిన్ థీమ్ చెప్పడం వీరి టాలెంట్...

14. EDITOR💥💥
ఏదైనా ఒక మూవీ కి మొదటి ప్రేక్షకుడు ఇతనే, డైరెక్టర్ సినిమా ఫుటేజ్ ను ఎంత సేపు తీసిన దానిని మనకు బోర్ కొట్టకుండా ఒక మంచి రన్ టైమ్ కు సెట్ చేసేది వీరే, సినిమాలో అంతగా అవసరం లేని షాట్స్ ని సీన్స్ ని కట్ చేయడం వీరి పని...

15. CHOREOGRAPHER💥💥
మన ఇండియన్ సినిమా లో పాటలు లేకపోతే ఏదో వెలితిగా ఉంటుంది, కమర్షియల్ సినిమా కి డాన్సు చాలా ఇంపర్టెంట్, ముఖ్యంగా బాడీ లాంగ్వేజ్ ను అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా స్టెప్స్ కంపోజ్ చేయడం వీరి పని...

16. MUSIC DIRECTOR💥💥
కళ్ళతో చూసేదానికి చెవులతో వినేది సింకైతేనే సినిమా ఎలివేషన్ సీనైనా సెంటిమెంట్ సీనైనా Music లేకపోతే ఆ ఫీలే రాదు, ఇంత మంది Music Lovers మన చుట్టూ ఉన్నారంటే దానికి కారణం వీరే...

17. MAKE-UP MAN💥💥
Screen పైన ఒక హీరో ఆర్ హీరోయిన్ అందంగా కనిపించారంటే అది వీరి పని తనమే, దీనికోసం మినిమం 2-3 అవర్స్ మేకప్ మ్యాన్ కష్టముంటుంది, ఒక హీరో ను ముసలి వాడిలా చూపించాలన్నా యంగ్ గా చూపించాలన్నా అది వీరి చేతిలో పనే...

18. CINE ARTISTS💥💥
అంటే చిన్న రోల్స్ తక్కువ డైలాగ్స్ తో సినిమా లో కనిపించేవారు, వీరు విలన్ వెనక ఉండే రౌడీ బ్యాచ్ కు ఎక్కువగా కనిపిస్తారు, చిన్న రోలైనా మంచి పేరొచ్చి స్టార్ అయిన వారు మన చుట్టూ చాలా మంది ఉన్నారు. Cine Artists కు ఇంకో పేరు Company Artists...

19. STILL PHOTOGRAPHERS💥💥
ఒక సినిమాకి ప్రమోషన్స్ ఎంత అవసరమో, ఆ ప్రమోషన్స్ కు మెయిన్ లీడ్స్ పోస్టర్స్ కూడా అంతే అవసరం, ప్రమోషన్స్ యూజ్ అయ్యేలా ఫొటోస్ తీయడం ఈయన పని...

20. OUTDOOR LIGHT MAN💥💥
Morning ను Night లా Night ను Morning లా చుపించేది వీరే, కెమెరా మ్యాన్ కు అవసరమైన లైటింగ్ ను ఇవడం ఇతని పని, Equipment చాలా బరువుగా హై ఓల్టేజ్ తో వేడిగా ఉంటుంది, కెమెరా ను మోసే క్రేన్ డిపార్ట్మెంట్ కూడా ఈ క్రాఫ్ట్ కిందకే వస్తుంది...

21. STUNT MASTER💥💥
లేదా Fight Masters, మూవీలో హీరోను ఎలివేట్ చేయాలన్నా హీరోయిజం చూపించాలన్నా కచ్చితంగా యాక్షన్ సీక్వెన్స్స్ ఉండాల్సిందే , సినిమా కోసం ఫిజికల్ గా ఎక్కువ కష్టపడేది, మన హీరోలను ఎక్కువగా కష్టపట్టేది Stunt Masters...

22. WRITER💥💥 
Producer దగ్గర ఎంత డబ్బున్నా స్టోరీ లేకుండా సినిమా తీయలేడు, సినిమాకి స్టోరీ రాసేవారిని స్టోరీ రైటర్స్ అంటారు, Lyricists కూడా ఈ క్రాఫ్ట్ కిందకే వస్తారు...

23. SINGER💥💥
మూవీల్లో పాటలు లేకపోతే మూవీ చూడలేం ఆ పాటకు స్వరం తో ప్రాణం పోసేది వీరే భాష రాని నటులకు తమ గొంతును అందించే డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా ఈ క్రాఫ్ట్ లోకే వస్తారు...

And Last 
24. DIRECTOR💥💥
Captain Of The Ship.. Director - ఒక టీమ్ ను లీడ్ చేయడానికి కెప్టెన్ ఎంత అవసరమో, ఈ 23 క్రాఫ్ట్స్ ను లీడ్ చేయడానికి డైరెక్టర్ అంత అవసరం, వీరి అందరి దగ్గరి నుంచి బెస్ట్ ఔట్పుట్ తేస్తేనే Cinema హిట్ అయ్యేది, ఒక డైరెక్టర్ కు ప్రతి క్రాఫ్ట్ మీద ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది.. ఏ సీన్ లో ఎంత మేరకు యాక్ట్ చేయాలి ఎంత లైటింగ్ ఉండాలి ఫ్రేమ్ ఎలా ఉండాలి సౌండ్ ఎక్కడ రావాలి ఇలా ప్రతిదీ నిర్ణయించేది దర్శకుడే.. 

Note::- డబ్బు రిస్క్ చేసి కథను నమ్మి సినిమా తీసే Producer మాత్రం ఈ 24 క్రాఫ్ట్స్ లో కి రారు....

#24Crafts #FilmMaking #Production #Direction 💥💥

T Vincente Ferrer✍️

Comments

Popular posts from this blog

Full information about CARDIAC ARREST & HEART ATTACK 💔💔💔💔💔💔💔💔💔💔

RAVE PARTY

We will said commonly that even an ant cannot sting without the command of Lord Shiva..So this article is all about that ANT 🐜🐜🐜🐜